దారుణం : అల్లుడి కుటుంబంపై మామ దాడి..ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
అల్లుడి కుటుంబంపై మామ దాడి | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. నిడమనూరు మండలం బొక్కమంతల పహాడ్ గ్రామానికి చెందిన జల్లెపల్లి సూరయ్య తన కూతురు శ్యామలను అత్తింటి వారు కాపురానికి తీసుకెళ్లడం లేదు. దీంతో వారి కుటుంబంపై పగ పెంచుకున్న సూరయ్య అల్లుడి కుటుంబంపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో సూరయ్య అల్లుడి తల్లి (అచ్చమ్మ) అక్కడికక్కడే మృతి చెందింది.
కాగా, అల్లుడు శివనారాయణ, అతడి తండ్రి భిక్షం, శివనారాయణ అమ్మమ్మ నారమ్మల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను మిర్యాలగూడ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

