Vikarabad : వాగు దాటుతూ తిరిగిరాని లోకాలకు..

వికారాబాద్ : ఉధృతంగా పారుతున్న వాగును దాటే ప్రయత్నం చేస్తూ, బైక్‌తో సహా ఓ వ్యక్తి వాగులో కొట్టుకపోయి మృతి చెందిన సంఘటన పులుసుమామిడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు షేక్ ఇసాక్ పాషా(30)కు సంవత్సరంన్నర క్రితమే సమీనభేగంతో వివాహం జరిగింది. వీరికి రెండు నెలల క్రితమే ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. బోరు మెకానిక్కు సంబంధించిన పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. సోమవారం మెకానిక్కు సంబంధించిన వస్తువులు తీసుకొచ్చేందుకు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్నాడు. రాత్రి భారీ వర్షం కురువడంతో చెరువులు నీటి ప్రవాహంతో ఉధృతంగా పారుతున్నాయి.
పులుసుమామిడి వాగుకు అటువైపు ఉన్న అధికారులు రావద్దని హెచ్చరించినా వినకుండా ఇసాక్పాషా వాగు దాటే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహంలో బైక్‌తో సహా కొట్టుకపోతుండటంతో అధికారులు, పోలీసులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. గళ్లంతైన వ్యక్తి కోసం మంగళవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా, నవాబుపేట మండలం అత్తాపూర్ గ్రామ సమీపంలో శవమై కనిపించాడు. పులుసుమామిడి వాగును వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, వికారాబాద్ డీఎస్పీ సంజీవరావులు పరిశీలించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించా రు. వారి వెంట మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

