‘నీట్’ భయంతో తమిళ విద్యార్థి ఆత్మహత్య

చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది. అయితే ఈ పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన వ్యక్తిని సేలంలోని మెట్టూరు సమీపంలోని కూజయ్యూర్‌కు చెందిన 19 ఏండ్ల ధనుష్‌గా గుర్తించారు. అతడు గతంలో రెండు సార్లు నీట్‌కు హాజరయ్యాడు. అయితే పాస్ కాకపోవడంతో మరోసారి నీట్‌కు ప్రిపేర్ అయ్యాడు. అయితే ఈసారి కూడా అందులో అర్హత సాధించలేనన్న భయంతో ఆదివారం తెల్లవారుజామున తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడు నీట్‌పై ఒత్తిడిలో ఉన్నట్లు ధనుష్ తల్లిదండ్రులు, సోదరుడు తెలిపారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడులో నీట్‌ను ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 12 మందికిపైగా వైద్య విద్య ఆశావహులు పరీక్షపై భయం లేదా పాస్ కాలేమన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడి మరణించారు. తాజాగా తన ప్రాంతానికి చెందిన విద్యార్థి ధనుష్ ఆత్మహత్యపై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించారు. నీట్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై ట్విట్టర్లో ప్రశ్నించారు.
మరోవైపు నీట్ విద్యార్థి ఆత్మహత్యపై సీఎం స్టాలిన్ స్పందించారు. నీట్ నుంచి శాశ్వత మినహాయింపును కోరే బిల్లును అసెంబ్లీలో సోమవారం పాస్ చేస్తామని తెలిపారు. అన్యాయానికి ముగింపు పలుకుదాం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

