e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూషన్‌ టీచర్‌ అరెస్ట్‌

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూషన్‌ టీచర్‌ అరెస్ట్‌

కోల్‌కతా: ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూషన్ టీచర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. పరీక్షల నేపథ్యంలో 16 ఏండ్ల బాలిక ట్యూషన్‌ కోసం ఒక టీచర్‌ ఇంటికి వెళ్తున్నది. ఈ నేపథ్యంలో 40 ఏండ్ల బయోలజీ టీచర్‌ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా ముద్దు పెట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తన తండ్రికి ఈ విషయం చెప్పడంతో ఈ నెల 7న పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద ఆ టీచర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మెజిస్ట్రేట్‌ ఎదుట బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తామని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement