కారు దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

చండీగఢ్: ఒక మెర్సిడెస్ కారు వేగంగా దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మరణించారు. పంజాబ్‌లోని మొహాలిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న మెర్సిడెస్ కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రాధా సోమి చౌక్ వద్ద శనివారం తెల్లవారుజామున సైకిళ్లపై వెళ్తున్న ఇద్దరితోపాటు నైట్ షిఫ్ట్ ఉద్యోగులతో వెళ్తున్న ఆఫీస్ క్యాబ్పైకి కారు దూసుకెళ్లింది. ఆ క్యాబ్ 2-3 సార్లు పల్టీకొట్టగా, అనంతనం ఆ కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప ర్యాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక సైకిలిస్ట్, క్యాబ్‌లోని ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు.
ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో కారు డ్రైవర్‌తోపాటు అందులో ప్రయాణించిన ఇద్దరికి ప్రాణాపాయం తప్పింది. గాయపడిన వారు మరో వాహనంలో అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. బీభత్సం సృష్టించిన కారులో బీరు బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతడితోపాటు అందులో ప్రయాణించిన ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

