షాకింగ్ : తల్లిని చంపి శరీర భాగాలను తినేశాడు

మాడ్రిడ్ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో మతిస్థిమితం లేని వ్యక్తి తన తల్లిని చంపి ఆమెను తినడం కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడికి 15 ఏండ్ల 5 నెలల జైలు శిక్ష విధించారు. 2019 జనవరిలో అల్బెర్టో సాంచెజ్ గోమెజ్ (28) తన తల్లిని దారుణంగా చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఆపై 15 రోజుల పాటు తిన్నాడు. ఈ కేసులో సాంచెజ్ ను అదే ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేయగా ఏప్రిల్ లో విచారణ మొదలైంది.
నిందితుడికి న్యాయస్థానం తల్లిని హత్య చేసినందుకు 15 ఏండ్లు, మృతదేహాన్ని అపవిత్రం చేసినందుకు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు సోదరుడికి పరిహారం కింద 73,000 డాలర్లు చెల్లించాలని కోర్టు సాంచెజ్ ను ఆదేశించింది. కాగా, మానసికంగా కుంగుబాటుకు లోనైన సాంచెజ్ తల్లిని హత్య చేసి ఆమె మృతదేహంలో పలు భాగాలను టప్పర్ వేర్ బాక్సుల్లో ఉంచినట్టు స్పెయిన్ పోలీస్ అధికారులు గుర్తించారు. ఓ విషయంలో వాగ్వాదం జరగడంతో ఆవేశంలో సాంచెజ్ తన తల్లిని చంపినట్టు పోలీసులు కనుగొన్నారు. ఆపై ఆమె శరీరాన్ని కత్తులు, కార్పెంటర్ వాడే రంపంతో కోసి వాటిలో కొన్ని ముక్కలను ఫ్రీజర్ లో, మరికొన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

