కుమ్ర౦ భీం ఆసీఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టికున్నారు. జిల్లాలోని కెరమెరి మండల కేంద్రం నుంచి వాంకిడి మండలానికి గుట్కాలను తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రం సమీపంలో సోదాలు నిర్వహించి భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు.
గుట్కా తరలిస్తున్న వాహనంతో పాటు ముగ్గురు వ్యక్తులు షేక్ ఫిరోజ్, గణపతి, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.