Heroin seize | ముంబై ఎయిర్‌పోర్టులో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
Heroin seize | ఆఫ్రికన్ దేశం నుంచి మన దేశంలోకి మత్తు మందు రవాణాను కనుగొన్నారు. మలావీ నుంచి హెరాయిన్‌ను తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుంది.
Heroin seize | ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తు మత్తు మందు హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పకడ్బందీ సమాచారం మేరకు మలావీ నుంచి వస్తున్న ప్రయాణికులపై కన్నేసి ఈ మత్తుమందును పట్టుకున్నట్లు తెలుస్తున్నది.
ఆఫ్రికన్ దేశమైన మలావీ నుంచి ఖతార్ మీదుగా ముంబైకి వస్తున్న ఓ ప్రయాణికుడు దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన కచ్చితమైన సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాపు కాశారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
మలావీ ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయగా ట్రాలీ బ్యాగు కావిటీస్ తయారుచేసి దాచిన 16 కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేసిన ఘనా మహిళను కూడా అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఉంటుందని, ప్రయాణికులను అరెస్ట్ చేయడంతో స్థానిక కోర్టు డీఆర్ఐ కస్టడీకి తరలించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

