పట్నా : బాలికను బలవంతంగా వ్యభిచార వృత్తిలో దింపారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్‌ను రట్టు చేశారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జఫా మార్కెట్ ప్రాంతంలో జనావాసాల మధ్య చీకటి దందా జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు.
ఈ ఘటనలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు, డబ్బు ఇస్తామని మభ్యపెడుతూ మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ప్రధాన సూత్రధారి షాజహాన్ ఖతూన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు ఉద్యోగం ఆశ చూపి బలవంతంగా ఈ వృత్తిలోకి దింపారని ఓ మహిళ వాపోయారు.
వ్యభిచారం చేసేందుకు తాను నిరాకరించగా తీవ్రంగా హింసించారని బాధితురాలు తెలిపింది. కస్టమర్ల నుంచి రూ 600 నుంచి రూ 5000 వరకూ వసూలు చేసి వారి వద్దకు యువతులను పంపుతామని నిర్వాహకురాలు ఖతూన్ పోలీసులకు వెల్లడించింది.