న్యూఢిల్లీ : స్పా, మసాజ్ మాటున వ్యభిచార దందా సాగిస్తున్న రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దయానంద్ విహార్‌లో జరుగుతున్న ఈ చీకటి దందా ఆట కట్టించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వెనెజ్ థాయ్ స్పా పేరుతో దయానంద్ విహార్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు స్పాపై దాడులు చేపట్టారు.
కస్టమర్ పేరుతో స్పాను సందర్శించిన పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్పా లైసెన్స్ కూడా గడువు ముగిసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. స్పాను సీజ్ చేసేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.