ఇండోర్ : తన పేరు, మతం వివరాలు దాచి పెండ్లి చేసుకున్న భర్త అసలు రంగు బయటపడటంతో అతడిపై లవ్ జిహాద్ కేసు దాఖలు చేసిన మహిళ ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇండోర్‌లో జిమ్ ట్రైనర్‌గా పనిచేసే ముస్తాఫా అనే యువకుడు గబ్బర్‌గా బాధితురాలికి పరిచయమై పెండ్లి చేసుకున్నాడు. ఆపై మహిళ గర్భం దాల్చడంతో మెడికల్ చెకప్ కోసం వారు ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు.
దవాఖానలో గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరగా అందులో అతడి పేరు ముస్తాఫాగా ఉండటంతో మహిళ విస్తుపోయింది. దీంతో ద్వారకాపురి పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా ముస్తాఫాపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా ఏడాది కిందట ఓ బర్త్‌డే పార్టీలో బాధితురాలికి పరిచయమైన నిందితుడు తన వివరాలను దాచి గబ్బర్ పేరుతో ఆమెకు దగ్గరై ఆపై పెండ్లి చేసుకున్నాడు. మరోవైపు యూపీలోని మీరట్‌లో 18 ఏండ్ల యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నించిన ఓ ప్రైవేట్ ట్యూటర్(25)ను పోలీసులు అరెస్ట్ చేశారు.