ఇద్దరు దొంగలపై పీడీ యాక్ట్
క్రైం న్యూస్ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన మంచిర్యాల జిల్లా, దండేపల్లి చెందిన తాండ్ర ప్రదీప్, ముడిమడుగల చంద్రశేఖర్‌పై వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం పీడీ యాక్ట్ ఉతర్వులను జారీ చేశారు.

వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన మంచిర్యాల జిల్లా, దండేపల్లి చెందిన తాండ్ర ప్రదీప్, ముడిమడుగల చంద్రశేఖర్‌పై వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం పీడీ యాక్ట్ ఉతర్వులను జారీ చేశారు. సీపీ డా.తరుణ్ జోషి జారీచేసిన ఉత్తర్వులను ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ బి.రమేష్ వరంగల్ కేంద్రకారాగారంలో ఉన్న నిందితులకు జైలు అధికారుల సమక్షంలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసారు.
పోలీసుల కథనం మేరకు..నిందితులిద్దరు మరో నలుగురు నిందితులతో కలిసి రాత్రి వేళల్లో కారులో ప్రయాణిస్తూ తాళం వేసివున్న ఇండ్లను టార్గెట్ చేసేవారు. తమ వెంట తెచ్చుకున్న సాధనాలతో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడే వారు.
ఇదే రీతిలో నిందితులు ఈ సంవత్సరం జనవరి 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో ధర్మసాగర్ మండల కేంద్రంలో వరుసగా ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు.
గతంలో జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల వేములవాడ, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదగిరి గుట్ట ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితులను ధర్మసాగర్ పోలీసులు ఈ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదిన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
నేరాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని సీపీ హైచ్చరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

