Road Accident | లారీ ఢీకొని పంచాయతీ వర్కర్ మృతి
Road Accident | జిల్లాలోని డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు.
కంటేశ్వర్ ( నిజామాబాద్) : జిల్లాలోని డిచ్పల్లి( Dichpalli) మండలం ధర్మారం (బి) గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ధర్మారం గ్రామానికి చెందిన మొగుళ్ల కుంటయ్య (79) గ్రామపంచాయతీ వర్కర్ ( Panchayat Worker ) గా పనిచేస్తున్నాడు.
విధి నిర్వహణలో భాగంగా స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేయడానికి సైకిల్‌పై వస్తుండగా మెంట్రాజ్ పల్లి ఎక్స్‌రోడ్ వద్ద మినీ ఐచర్ డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

