రెస్టారెంట్ లో బ్లాక్ దందా : 93 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పట్టివేత

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ తో కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాధార మందుల బ్లాక్ మార్కెటింగ్ యధేచ్చగా సాగుతోంది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ లో ఓ రెస్టారెంట్ లో నిల్వ చేసిన 93 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్లాక్ మార్కెట్ గురించిన సమాచారం అందడంతో ఖాన్ మార్కెట్ ప్రాంతంలోని ఖాన్ చచా రెస్టారెంట్ పై పోలీసులు దాడులు జరిపారు.
ఈ దాడుల్లో రెస్టారెంట్ లో దాచిన 93 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నా రెస్టారెంట్ ను తెరిచిఉంచిన నిందితులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్లాక్ దందాకు తెరలేపారు. నిందితులపై నిత్యావసర వస్తువుల చట్టం, అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా లోథి రోడ్డులోని ఓ రెస్టారెంట్ లో 419 ఆక్సిజన్ సిలిండర్లు పట్టుబడిన కొద్దిరోజులకే ఈ ఉదంతం వెలుగుచూడటం గమనార్హం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

