Robbery | నడిరోడ్డుపై.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భారీ దోపిడీ.. దోచుకున్నదెంతంటే?
Robbery | దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ( Robbery ) జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్( Traffic Signal ) పడగానే ఆగిన ఓ ద్విచక్ర వాహనదారుడి బ్యాగులో నుంచి రూ. 40 లక్షలు మాయం చేశారు దొంగలు. ఈ ఘటన ఢిల్లీలోని ఎర్రకోట( Red Fort ) వద్ద మార్చి 1న సాయంత్రం సమయంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
Robbery| దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్( Traffic Signal ) పడగానే ఆగిన ఓ ద్విచక్ర వాహనదారుడి బ్యాగులో నుంచి రూ. 40 లక్షలు మాయం చేశారు దొంగలు. ఈ ఘటన ఢిల్లీలోని ఎర్రకోట( Red Fort ) వద్ద మార్చి 1న సాయంత్రం సమయంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు.. రూ. 40 లక్షల నగదు తీసుకొని బైక్పై వెళ్తున్నాడు. అయితే భారీగా నగదు తీసుకొని వెళ్తున్న ఆ యువకుడిని ఓ ముగ్గురు యువకులు అనుసరించారు. ఎర్రకోట వద్ద సిగ్నల్ పడగానే.. బైక్ను ఫాలో అయిన ఆ ముగ్గురు క్షణాల్లోనే రూ. 40 లక్షల నగదును కొట్టేశారు.

ఒకరేమో బ్యాగు జిప్ను తీయగా, మరో యువకుడు డబ్బును క్షణాల్లో తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ యువకుడు మూడో వ్యక్తికి డబ్బు అందజేయగా, అక్కడ్నుంచి జారుకున్నాడు. అయితే సిగ్నల్ వద్ద ఇతర వాహనదారులు ఉన్నప్పటికీ, ఈ చోరీ ఘటనను గమనించలేదు.
తన గమ్యస్థానానికి చేరుకున్న ద్విచక్ర వాహనదారుడు బ్యాగు తెరిచి చూడగా, నగదు మాయమైంది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎర్రకోట వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం ముగ్గురిలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆకాశ్, అభిషేక్గా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 38 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనదారులను దొంగలు టార్గెట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

