తల్లి కళ్లెదుటే కూతురిపై సామూహిక అత్యాచారం
Jharkhand | కొంత మంది యువకులు క్రూర మృగల్లా ప్రవర్తించారు. ఓ మైనర్‌పై బాలికపై కామంతో విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
రాంచీ : కొంత మంది యువకులు క్రూర మృగల్లా ప్రవర్తించారు. ఓ మైనర్‌పై బాలికపై కామంతో విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
దమ్కా జిల్లాకు చెందిన ఓ తల్లీకూతురు.. ఓ వేడుక నిమిత్తం దియోఘర్‌కు ఆదివారం వెళ్లారు. వేడుక ముగిసిన అనంతరం వారిద్దరూ మళ్లీ దమ్కా జిల్లాలోని తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. అయితే మదుపూర్ ఏరియాలో తల్లీబిడ్డలను ఓ ఐదుగురు యువకులు అడ్డగించారు. తల్లి ముందే ఆ బిడ్డపై కామాంధులు విరుచుకుపడ్డారు. తన కూతుర్ని ఏం చేయొద్దంటూ అడ్డుకోబోయిన తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.
దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

