దారుణం : అభ్యంతరకర వీడియో లీక్ చేస్తామని బెదిరించి విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి!
మహారాష్ట్రలోని నాగపూర్‌లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. గతంలో రికార్డు చేసిన వీడియోను చూపి బెదిరించి బాలికపై ఆమె బాయ్‌ఫ్రెండ్ మరో ఇద్దరు సహచరులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ముంబై : మహారాష్ట్రలోని నాగపూర్‌లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. గతంలో రికార్డు చేసిన వీడియోను చూపి బెదిరించి బాలికపై ఆమె బాయ్‌ఫ్రెండ్ మరో ఇద్దరు సహచరులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నాగపూర్‌లోని జరిపట్క ప్రాంతానికి చెందిన బాధితురాలు బుటిబోరి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది.
ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతున్న విద్యార్ధినికి అదే క్లాస్‌కు చెందిన యష్ ఆనంద్ కాంబ్లేతో పరిచయం ఏర్పడింది. ఆపై ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో బాయ్‌ఫ్రెండ్ కాంబ్లే అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేశాడు. ఇక ఏప్రిల్ 17న నిందితుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గర్ల్‌ఫ్రెండ్‌ను తన ఇంటికి పిలిపించాడు.
ఆ సమయంలో గతంలో రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపి తన ఇద్దరు స్నేహితులు బిట్టు, చికు సహా తన కోరిక తీర్చాలని లేకుంటే ఆ వీడియోను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. ఆపై ముగ్గురూ బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. నిందితులపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abused
- blackmailed
- Boyfriend
- Girl
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

