పెళ్లి రద్దుకు కారణమైన షాంపూ.. పోలీసులకు ఫిర్యాదు
Shampoo | రూపాయి విలువ చేసే షాంపూ ఏకంగా పెళ్లిని రద్దు చేసింది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే అనిపించినప్పటికీ.. ఇది నిజమే. పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు ఇంటికి పంపించిన కొన్ని వస్తువుల్లో షాంపూ కూడా ఉంది. అయితే ఆ షాంపూ చాలా
గువాహటి : రూపాయి విలువ చేసే షాంపూ ఏకంగా పెళ్లిని రద్దు చేసింది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే అనిపించినప్పటికీ.. ఇది నిజమే. పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు ఇంటికి పంపించిన కొన్ని వస్తువుల్లో షాంపూ కూడా ఉంది. అయితే ఆ షాంపూ చాలా తక్కువ ధరలో ఉండటంతో వధువు ఆగ్రహాంతో వరుడిని నిలదీసింది. దీంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన అసోంలోని గువాహటిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గువాహటికి చెందిన ఓ ఇంజినీర్‌తో ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే ఈ నెల 14న వారి వివాహం జరగాల్సి ఉండే. ఈ క్రమంలో పెళ్లికి ముందు విలువైన బహుమతులతో పాటు కొన్ని వస్తువులను పెళ్లి కూతురుకు వరుడి కుటుంబ సభ్యులు పంపించారు. ఆ వస్తువుల్లో షాంపూ కూడా ఉంది. కానీ అది చాలా తక్కువ రేటుది. దీంతో వధువుకు కోపం వచ్చింది. నీ స్థాయి ఇంతేనా అంటూ వరుడికి వాట్సాప్‌లో మేసేజ్ పంపింది యువతి. తీవ్ర మనస్తాపానికి గురైన వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా వరుడు తన మనసును మార్చుకోలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

