Cryptocurrency Scam | క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో వ్యాపారికి టోకరా : రూ. 1.2 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు
కేరళలోని కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి చైనీస్ క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో (Cryptocurrency Scam) ఏకంగా రూ. 1.2 కోట్లు కోల్పోయాడు.
తిరువనంతపురం : ఆన్లైన్ స్కామ్‌లు, స్కీమ్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. రోజుకో స్కామ్‌తో ఆన్లైన్ వేదికగా క్షణాల్లో ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. ఇక లేటెస్ట్గా కేరళలోని కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి చైనీస్ క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో (Cryptocurrency Scam) ఏకంగా రూ. 1.2 కోట్లు కోల్పోయాడు. నగరానికి చెందిన వ్యాపారి (35) సుజీత్‌ను ఈ ఏడాది జూన్‌లో సోషల్ మీడియా చాట్‌లో స్కామర్లు సంప్రదించారు.
ఫోనీ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని వారు సుజీత్‌ను మభ్యపెట్టారు. అధిక లాభాలు ఆర్జించవచ్చని ముగ్గులో దింపారు. సుజీత్ అమెరికన్ డాలర్లను క్రిప్టోకరెన్సీలోకి మార్చుకుని ఆ సంస్ధలో పెట్టుబడి పెట్టాడు. క్రిప్టోకరెన్సీ రేటు ఆధారంగా రిటన్స్ అందిస్తామని స్కామర్లు నమ్మబలికారు. యాప్‌లో తనకు లాభాలు వచ్చినట్టు చూపడంతో ఇది సరైన ట్రేడింగ్ సంస్ధేనని సుజీత్ భావించాడు.
లాభం పెరుగుతున్న కొద్దీ సర్వీస్ చార్జ్, ట్యాక్స్‌ల పేరుతో సుజీత్ నుంచి స్కామర్లు రూ. 30 లక్షలు పైగా రాబట్టారు. ఆపై పలుమార్లు పన్నుల పేరుతో దండుకున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన సుజీత్ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ స్కామ్‌లో పలువురు చైనీయులతో పాటు భారతీయులు ఉన్నారని సైబర్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

