మాజీ భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తం ఎక్కించిన భర్త
Gujarat | ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. విడాకులు ఇచ్చిందనే కోపంతో మాజీ భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది.
సూరత్ : ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. విడాకులు ఇచ్చిందనే కోపంతో మాజీ భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన శంకర్ కాంబ్లేకు తన భార్య రెండు నెలల క్రితం విడాకులు ఇచ్చింది. అయితే తిరిగి ఇంటికి రావాలని భార్యను కోరాడు. కానీ భార్య అందుకు తిరస్కరించింది. దీంతో కోపం తెచ్చుకున్న కాంబ్లే.. తన మాజీ భార్యను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు. కాసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంబ్లేను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని హెచ్ఐవీ వార్డుకు వెళ్లి.. ఓ పాజిటివ్ రోగి నుంచి రక్తాన్ని సేకరించినట్లు నిందితుడు తెలిపాడు. రక్త పరీక్షలకు అని చెప్పి రక్తాన్ని సేకరించానని పేర్కొన్నాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | పాలమూరు ప్రజలారా.. రేవంత్ రెడ్డి మోసాలకు మరోసారి బలికావద్దు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం
Meenakshi Chaudhary | చీరకట్టులోనూ గ్లామర్ డోస్ పెంచిన మీనాక్షి.. అదిరిపోయే ఫొటోలు!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
KTR | రోడ్డు ప్రమాద బాధితుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

