దారుణం : వదిన స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆపై బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడి!

ముంబై : కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. మహారాష్ట్రలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. వదిన స్నానం చేస్తుండగా వీడియో తీసిన మరిది (25) ఆపై వీడియోను బయటపెడతానని బెదిరిస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన పుణేలో ఆలస్యంగా వెలుగుచూసింది.
నెల రోజుల కిందట తాను స్నానం చేస్తుండగా మరిది వీడియో తీసి ఆపై వీడియోను బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ హింజెవాది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లైంగిక దాడిని ప్రతిఘటించినందుకు నిందితుడు తనను తీవ్రంగా కొట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనపై తొలుత ఎవరికీ చెప్పని మహిళ నిందితుడు వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ మరోసారి లైంగిక దాడికి ప్రయత్నించడంతో భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు పర్బని జిల్లాలోని స్వస్థలానికి వెళ్లాడని అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

