న్యూఢిల్లీ : మేనకోడలి(18)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి(38)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలోని కస్నాలో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం నిందితుడు, బాధితురాలు పక్కపక్క ఇండ్లలోనే ఉంటున్న క్రమంలో ఒంటిరిగా ఉన్న నిందితుడు తన కోసం వంట చేయాలని మేనకోడలిని పిలిపించాడు.
ఆపై కిచెన్లోకి చొరబడి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించాడు. నిందితుడి బెదిరింపులతో చాలారోజులు మౌనం దాల్చిన బాధితురాలు ఇటీవల జరిగిన విషయం ఇంట్లో చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఢిల్లీ సమీపంలోని ఖన్పూర్ గ్రామంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.