వర్క్ ఈమెయిల్స్‌లో అసభ్య సందేశాలు : బాస్‌ను కోర్టుకీడ్చిన మహిళా టెకీ
వర్క్ ఈ-మెయిల్స్‌లో మహిళా టెకీకి అసభ్య సందేశాలు పంపిన బాస్‌కు ఆమె చుక్కలు చూపించింది. అశ్లీల సందేశాలు పంపినందుకు బాస్‌ను ఏకంగా కోర్టుకీడ్చింది.
న్యూయార్క్ : వర్క్ ఈ-మెయిల్స్‌లో మహిళా టెకీకి అసభ్య సందేశాలు పంపిన బాస్‌కు ఆమె చుక్కలు చూపించింది. అశ్లీల సందేశాలు పంపినందుకు బాస్‌ను ఏకంగా కోర్టుకీడ్చింది. మాల్టాకు చెందిన ఎస్డాక్స్ అనే ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మహిళకు ఆమె బాస్ వర్క్ ఈ-మెయిల్స్‌లో ఎక్స్ఎక్స్ అనే సింబల్స్ పంపాడు. ఎక్స్ఎక్స్ అంటే హగ్స్, కిస్లని అర్ధం కాగా, సాధారణంగా వీటిని ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, ఆత్మీయులకు వాట్సాప్ లేదా టెక్ట్స్ మెసేజ్ రూపంలో పంపుతుంటారు.
వీటిని మహిళా టెకీకి ఈ-మెయిల్స్‌లో పంపడంతో కంగుతిన్న ఆమె బాస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. తన బాస్ అలెగ్జాండర్ గులాండ్రిస్పై ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ కరీనా గస్పరొవా తీవ్ర ఆరోపణలు చేశారు. గులాండ్రిస్ పంపిన ఈమెయిల్స్, వీడియో కాల్స్‌లో ప్రవర్తన ప్రకారం అతడు తనతో లైంగిక సంబంధం కోరుకుంటున్నాడని బయటపడిందని ఆమె ఆరోపించారు. తనతో లైంగిక బంధానికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తావని అతడు ఒత్తిడి తీసుకువస్తూ క్వశ్చన్ మార్క్స్ వాడేవాడని పేర్కొంది. లైంగిక సంబంధానికి నిరాకరించడంతో ఆ కోపంతో బాస్ తనపై కేకలు వేశాడని ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా బాధితురాలు కరీనా గస్పరొవ తెలిపారు.
ఈ కేసును, సమర్పించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట లండన్ సెంట్రల్ కోర్ట్‌లోని ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ కరీనా గస్పరొవ వివరణ వక్రీకరించబడిందని నిర్ధారించింది. కరీనా గస్పరొవ వాదన నమ్మశక్యంగా లేదని, ఆధారాలు లేకుండా సంచలన ఆరోపణలు చేశారని ఎంప్లాయ్మెంట్ జడ్జి ఎమ్మా బర్న్స్ స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు గస్పరొవా ఎస్డాక్స్కు రూ. 5 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Read More
viral video | జేబులో ఉన్న మొబైల్ ఫోన్ నుంచి మంటలు.. త్రుటిలో తప్పించుకున్న వృద్ధుడు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- boss
- IT worker
- sues
- video calls
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

