దారుణం : మహిళపై సామూహిక అత్యాచారం..వివస్త్రను చేసి హైవేపై పడవేశారు!
మహిళపై సామూహిక అత్యాచారనికి పాల్పడి ఆమెను రోడ్డు పక్కన నగ్నంగా పడవేసిన దారుణ ఉదంతం మహారాష్ట్రలోని బంధర జిల్లాలో కలకలం రేపింది.
ముంబై : మహిళపై సామూహిక అత్యాచారనికి పాల్పడి ఆమెను రోడ్డు పక్కన నగ్నంగా పడవేసిన దారుణ ఉదంతం మహారాష్ట్రలోని బంధర జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మహిళ (35) వివస్త్రగా బ్రిడ్జి వద్ద పడిఉన్నదనే సమాచారంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. మహిళను స్దానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స నిమిత్తం నాగపూర్ మెడికల్ కాలేజ్‌కు తరలించారు.
మహిళ స్టేట్మెంట్ను రికార్డు చేశామని కర్ధ ఎస్ఐ రాజేష్ థొరట్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు గోరేగావ్ తహిసిల్‌లోని కమరగావ్లో నివసించే సోదరుడి వద్దకు జులై 30న వెళుతుండగా ఈ దారుణం జరిగింది. మహిళను తన సోదరుడి ఇంటికి తీసుకువెళతానని నమ్మబలికిన నిందితుడు శ్రీరాం ఉర్కుడె ఆమెను పలస్గావ్కు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి జాతీయ రహదారి వెంబడి అటవీ ప్రాంతం వద్ద వదిలేశాడు.
ఆగస్ట్ 1న బాధితురాలు బంధర జిల్లా కన్హల్మోహ్ చేరుకోగా మరో నిందితుడు లుక్కా అశోక్ సర్వే ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశాడు. అశోక్‌కు నేరం చేయడంలో మరో నిందితుడు మహ్మద్ ఇజాజ్ అన్సారీ సహకరించాడు. అశోక్, అన్సారీలను అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడు ఉర్కుడె కోసం గాలిస్తున్నారు. ఈ కేసును గోరేగావ్ పోలీసులకు బదలాయించగా తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

