దారుణం : మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించి ముగ్గురు బాలికలపై లైంగిక దాడి!
దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబై వెళ్లేందుకు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబై వెళ్లేందుకు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది. గత నెలలో ముంబై వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ముగ్గరు మైనర్ బాలికలను గమనించిన వ్యక్తి వారి వద్దకు వచ్చి టికెట్లు బుక్ చేయడంలో సహకరిస్తానని నమ్మబలికాడు.
ముగ్గురు బాలికలను నిందితుడు రోహిణిలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు బాలికలకు పానీయంలో మత్తు మందు కలిపి ఇవ్వగా స్ప్రహ కోల్పోయిన బాలికలపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు తమను ముంబైకి పంపాలని బాలికలు కోరగా రాజస్ధాన్‌లో వారికి పెండ్లి జరిపిస్తానని చెప్పాడు.
ఆపై కశ్మీరీ గేట్‌కు చేరుకోగానే బాలికలు నిందితుడి చెర నుంచి బయటపడి జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలిపారు. కుటుంబసభ్యుల సహకారంతో బాలికలను డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించి స్టేట్మెంట్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి కేసు వివరాలను వెల్లడించాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

