షాపింగ్ మాల్లో మూవీ ప్రమోషన్స్ : ఇద్దరు హీరోయిన్లకు లైంగిక వేధింపులు
త్వరలో విడుదల కానున్న తమ సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు కాలికట్‌లోని ఓ మాల్‌ను సందర్శించిన ఇద్దరు మళయాళం నటీమణులు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.
తిరువనంతపురం : త్వరలో విడుదల కానున్న తమ సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు కాలికట్‌లోని ఓ మాల్‌ను సందర్శించిన ఇద్దరు మళయాళం నటీమణులు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. భారీగా గుమికూడిన జనాల నుంచి ఒకరిద్దరు వారిని లైంగిక వేధింపులకు గురిచేశారు. విపరీతమైన రద్దీలో మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ప్రవేశ ద్వారం వద్ద ఈ ఘటన ఎదురైంది. తనను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఓ నటి చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారు.
#SaturdayNight promotion at Kozhikode HiLite mall…!!
Someone misbehaved with #Saniya…!! Mis management from event managers 🤦Again it's proved that HiLite mall is not a best place for movie promotion! pic.twitter.com/ko3UvojhVh
— AB George (@AbGeorge_) September 27, 2022
తమకు ఎదురైన షాకింగ్ ఘటన గురించి ఇద్దరు నటీమణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాలికట్‌లోని ఓ మాల్లో తమ నూతన సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రజలు తమ పట్ల ఎంతో అభిమానం చూపారని, ఈవెంట్ ముగిసిన తర్వాత తాము తిరిగివస్తుండగా తన కొలీగ్ పట్ల ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, ఇంతలో తన పట్ల ఓ వ్యక్తి అలాగే ప్రవర్తించడంతో తాను షాక్ తిని రియాక్ట్ అయ్యానని నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇలాంటి పరిస్ధితి జీవితంలో ఎవరికీ ఎదురుకాకూడదని కోరుకుంటున్నానని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఆమె సహనటి కూడా తనకెదురైన అనుభవాన్ని మళయాళంలో సుదీర్ఘ పోస్ట్‌లో వివరించారు. మూవీ ప్రమోషన్స్‌లో తమ పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిపై సినీ బృందం న్యాయపరమైన చర్యలు చేపడుతుందని ఆమె పేర్కొన్నారు. మాల్ ఎంట్రన్స్ వద్ద లోపలికి వెళ్లేందుకు నటీమణులు ప్రయత్నించడం, వీరు ప్రస్తావించిన ఘటనలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

