పెళ్లింట విషాదం…వరుడు మృతి..

బెంగళూరు: హుబ్లీలో పెళ్లింట విషాదం నెలకొన్నది.పెండ్లి జరిగి కొన్నిగంటలు కూడా గడవకముందే పెండ్లి కుమారుడు మృతి చెందాడు. మరుసటి రోజే వరుడిని మృత్యువు బలితీసుకుంది. పచ్చటి తోరణాలు కళకళలాడుతుండగానే పెళ్లింట చావుడప్పు మోగింది. అటు వరుడు, ఇటు వధువు ఇండ్లలో విషాదాన్ని మిగిల్చిన ఈఘటన హుబ్లీ జిల్లాలోని కలఘటిగి తాలూకా తబకహొన్నళ్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శశికుమార్ పట్టణ శెట్టికి శనివారం అతని స్వగృహంలో హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా మూకబసరికట్టికి చెందిన యువతితో వివాహమైంది. అనంతరం వధువు ఇంటికి నవదంపతులు వెళ్లారు. ఆదివారం శశికుమార్ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి తుదిశ్వాశ వదిలాడు. దీంతో శుభకార్యం జరిగిన కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- groom died
- hugli
- wedding
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

