తండ్రి, అన్న, తాత, బంధువు… బాలికపై ఐదేండ్లుగా లైంగిక దాడి
ముంబై: ఒక బాలికపై ఆమె తండ్రి, అన్న, తాత, దూరపు బంధువు గత ఐదేండ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ అనే అంశాన్ని ఇటీవల స్కూల్లో విద్యార్థులకు వివరించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో తండ్రి, సోదరుడిపై అత్యాచారం కింద, తాత, దూరపు బంధువుపై లైంగిక వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది.
బీహార్‌కు చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని పూణెలో నివసిస్తున్నది. ఆ కుటుంబానికి చెందిన మైనర్ బాలిక స్కూల్లో ఇటీవల ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ అనే అంశాన్ని వివరించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తనపై పాల్పడిన అఘాయిత్యాలను ఆ బాలిక బయటపెట్టింది. 2017లో బీహార్‌లో ఉన్నప్పటి నుంచి తండ్రి, 2020 నవంబర్‌లో అన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. అలాగే తాత, దూరపు బంధువు కూడా తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ బాలిక పోలీసులకు చెప్పింది.
ఈ నేపథ్యంలో 45 ఏండ్ల తండ్రి, సోదరుడిపై అత్యాచారం, 60 ఏండ్ల తాత, 25 ఏండ్ల దూరపు బంధువుపై అసభ్య ప్రవర్తన వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పూణె పోలీస్ ఇన్స్పెక్టర్ (క్రైమ్) అశ్విని సత్పుటే తెలిపారు. పోక్సో చట్టం సెక్షన్లు కూడా జత చేసినట్లు చెప్పారు. కాగా, బాలికపై వేర్వేరుగా లైంగిక దాడి ఘటనలు జరిగినందున సామూహిక లైంగిక దాడి కిందకు ఈ కేసు రాదని వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

