మేడ్చల్ మల్కాజ్గిరి : పీర్జాదిగూడ పరిధిలోని మల్లికార్జున నగర్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఇంటిని ఆనుకుని ఉన్న బట్టల దుకాణానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. తీవ్ర నష్టం వాటిల్లిందని బట్టల షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.