మహిళపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు అరెస్ట్..!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా మహిళను ఐదుగురు యువకులు సమీపంలోని పంటచేలల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కూప్ పోలీస్‌స్టేషన్ ఏరియాలో పదిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 5న రాత్రి భరత్‌కూప్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో స్థానిక యువకుడు, అతని నలుగురు స్నేహితులతో కలిసి అదే గ్రామంలో ఒంటిరిగా ఉన్న ఓ 27 ఏండ్ల మహిళ ఇంట్లో చొరబడ్డాడు. అనంతరం అందరూ కలిసి మహిళను ఊరి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి లాక్కెళ్లారు. అక్కడ అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పరువు పోతుందన్న కారణంగా బాధితురాలు ఇన్నిరోజులు ఈ విషయాన్ని దాచిపెట్టింది.
అయితే, కుటుంబసభ్యులు ధైర్యం చెప్పడంతో మంగళవారం వారితో కలిసి వెళ్లి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

