అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తులు కిడ్నాప్
Crime news: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒకేసారి నలుగురు భారత సంతతి వ్యక్తులు కిడ్నాప్‌కు గురయ్యారు.
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒకేసారి నలుగురు భారత సంతతి వ్యక్తులు కిడ్నాప్‌కు గురయ్యారు. కాలిఫోర్నియాలో అత్యంత రద్దీగా ఉండే మెర్సిడ్ కౌంటీలో ఈ కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. ఈ కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో రహదారికి ఇరువైపుల పలు రిటెయిల్ దుకాణాలు, రెస్టారెంట్లు ఉన్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నాప్ గురైన వ్యక్తులు జస్దీప్ సింగ్ (36), అతని భార్య జస్లీన్ కౌర్ (27), వారి కుమార్తె అరూహీ ధేరి (8 నెలలు), వారి బంధువు అమన్‌దీప్ సింగ్ (39)గా పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లు మారణాయుధాలు ధరించి ఉన్నారని స్థానికులు తెలిపారు.
కిడ్నాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తులో అన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు వెల్లడించారు. అయితే కిడ్నాపర్ ఎవరై ఉంటారు, కిడ్నాప్‌కు కారణం ఏమిటి అనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితులుగానీ, బాధితులుగానీ కనిపిస్తే వారి దగ్గరికి వెళ్లకూడదని, వెంటనే 911కు కాల్ చేయాలని సూచించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- California
- Crime news
- Kidnaping
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

