దారుణం : తాగిన మైకంలో వృద్ధురాలిపై లైంగిక దాడి!

లక్నో : యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులే కాకుండా వృద్ధ మహిళలకూ రక్షణ కరువైంది. ఫతేపూర్ జిల్లాలో 70 ఏండ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడగా బలియా జిల్లాలో 98 ఏండ్ల వృద్ధ మహిళపైనా ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఫతేపూర్ జిల్లాలో తరినవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ప్రాధమిక పాఠశాలలో యాచకురాలు (70) నిద్రిస్తుండగా నిందితుడు లక్ష్మి లోధి (32)తాగిన మైకంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక బలియా జిల్లాలో జరిగిన మరో ఘటనలో 98 ఏండ్ల వృద్ధురాలిపై 22 ఏండ్ల యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రస్ధా ప్రాంతంలో ఆగస్ట్ 20న వృద్ధురాలు తన ఇంట్లో ఉండగా సోను అనే నిందితుడు లైంగిక దాడికి ప్రయత్నించాడని తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులు కుటుంబ సభ్యులు, స్ధానికులు ఆందోళన చేపట్టడంతో చర్యలకు దిగారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

