మద్యం తాగిన గేదెలు.. అక్రమ అమ్మకాల గుట్టురట్టు

అహ్మదాబాద్: మద్యం తాగిన గేదెలు, అక్రమ లిక్కర్ అమ్మకాల గుట్టును అధికారులకు రట్టుచేశాయి. ఈ వింత ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. ముగ్గురు రైతులు అక్రమంగా సారా అమ్ముతున్నారు. లిక్కర్ సీసాలను గేదెలు తాగే నీటి తొట్టిలో దాచారు. అయితే కొన్ని సీసాలు పగలడంతో సారా నీటిలో కలిసింది. ఈ నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించాయి.
గేదెల వింత ప్రవర్తనకు ఆందోళన చెందిన ఒక రైతు పశు వైద్యుడ్ని రప్పించాడు. గేదెలు తాగిన నీటి వాసన, రంగును పరిశీలించిన ఆ పశువైద్యుడు అందులో మద్యం కలిసినట్లు గుర్తించాడు. అక్రమ సారా అమ్మకాల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సోమవారం ఆ పశుశాలపై పోలీసులు రైడ్ చేశారు. అక్కడ రహస్యంగా దాచిన రూ.32,000 విలువైన వంద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రైతులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

