బైక్‌పై వచ్చి కాల్పులు.. కాంగ్రెస్ నేత దారుణహత్య

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్పూర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రప్రతాప్ సింగ్ పర్మార్ (45)ను దుండగులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు. మంగళవారం రాత్రి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
కాగా ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పాతకక్షలే పర్మార్ హత్యకు కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు వెల్లడించారు. ఇదిలావుంటే పర్మార్ హత్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అచరులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. పరిసర ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. పర్మార్ హత్యపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమల్‌నాథ్, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

