మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలి.. బాలుడు మృతి

లక్నో: మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిన సంఘటనలో 12 ఏండ్ల బాలుడు మరణించాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాట్వర్ గ్రామానికి చెందిన మోను ఆరవ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం మొబైల్ ఫోన్ బ్యాటరీని ‘జాడూ చార్జర్’లో ఉంచి చార్జింగ్ చేశాడు. గంట తర్వాత బ్యాటరీ చార్జింగ్ అయ్యిందా లేదా అన్నది పరీక్షించేందుకు నాలుకతో టచ్ చేశాడు. వెంటనే ఆ బ్యాటరీ అతడి ముఖంపై పేలిపోయింది.
శబ్దం విన్న కుటుంబ సభ్యులు గదిలోకి వచ్చి చూడగా ముఖానికి తీవ్రగాయాలతో రక్తం మడుగులో మోను పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

