వైద్యుడి అసభ్య ప్రవర్తన.. నిరసన తెలిపిన మహిళపై దాడి

పాట్నా: వైద్యుడి అసభ్య ప్రవర్తనపై నిరసన తెలియజేసిన మహిళపై కొందరు దాడి చేసి కొట్టారు. బీహార్‌లోని హాజీపూర్‌లో ఈ దారుణం జరిగింది. స్థానిక మదై చౌక్ ప్రాంతంలోని డెంటల్ క్లినిక్‌కు చెకప్ కోసం వచ్చిన తనపై డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించినట్లు ఒక మహిళ ఆరోపించింది. తాను కేకలు వేయడంతో బయట ఉన్న తన కుమారుడు లోపలికి వచ్చాడని, దీంతో ఆ వైద్యుడి బారి నుంచి తాను బయటపడినట్లు ఆమె తెలిపింది. అయితే, డాక్టర్ అసభ్య ప్రవర్తనపై ఆ మహిళ ఆసుపత్రి వద్ద నిరసన తెలుపగా కొందరు ఆమెపై దాడి చేసి కొట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో డాక్టర్ అసభ్య ప్రవర్తనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు వైద్యానికి డబ్బులు చెల్లించేందుకు ఆ మహిళ నిరాకరించిందని, గట్టిగా అడగంతో డాక్టర్‌పై తప్పుడు ఫిర్యాదు చేసిందని నిందితుడి సోదరుడు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. కాగా, ఆ వైద్యుడు గతంలో కూడా పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అయితే ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాలేదని కొందరు స్థానికులు ఆరోపించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

