బెంగళూర్ : భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను కత్తిపోట్లతో కసితీరా చంపిన కసాయి ఉదంతం కర్నాటక రాజధాని బెంగళూర్‌లో వెలుగుచూసింది. నిందితుడిని ఫైనాన్షియర్‌గా పనిచేసే బీఆర్ కాంతరాజు (40)గా పోలీసులు గుర్తించారు. నగరంలోని అన్నపూర్ణేశ్వరినగర్కు చెందిన కాంతరాజు తన భార్య రూపకు కుటుంబసభ్యుల్లో ఇద్దరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాంతరాజు దంపతులు ఇటీవల కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి మూడురోజుల పాటు చిక్మగళూర్ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు బంధువులతో తన భార్య డ్యాన్స్ చేయడం కాంతరాజు గమనించాడు. ఆపై బెంగళూర్ తిరిగివచ్చిన అనంతరం ఈ విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. వివాదం మరుసటి రోజూ కొనసాగడంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు స్కూడ్రైవర్, కత్తితో రూప మెడపై దాడి చేశాడు. ఘటన అనంతరం కాంతరాజు పరారయ్యాడు. నిందితుడు కాంతరాజును అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.