విద్యార్ధినికి అశ్లీల వీడియోలు పంపిన బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్
మహిళ వాట్సాప్ నెంబర్‌ను హ్యాక్ చేసి ఆమెకు అశ్లీల వీడియోలు, అసభ్య సందేశాలు పంపుతున్న ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.
ముంబై : మహిళ వాట్సాప్ నెంబర్‌ను హ్యాక్ చేసి ఆమెకు అశ్లీల వీడియోలు, అసభ్య సందేశాలు పంపుతున్న ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. బాధితురాలు ఓ కాలేజ్ విద్యార్ధిని ఈ ఏడాది ఫిబ్రవరిలో అంధేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన వాట్సాప్‌కు పదేపదే అశ్లీల వీడియోలు వస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు విచారణ చేపట్టి ధారావిలో నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, 12 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఐరోలిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేసే రవి దందు (32)గా గుర్తించారు. యూట్యూబ్ వీడియోల ద్వారా వాట్సాప్ అకౌంట్‌ను హ్యాక్ చేయడం తెలుసుకున్నానని నిందితుడు పోలీసులకు వెల్లడించాడు.
కాలేజీ విద్యార్ధినికి యూనివర్సిటీ ప్రొఫైసర్గా పరిచయం చేసుకున్నానని, ఆమె మొబైల్ నెంబర్‌కు పంపిన ఓటీపీని తనకు చెప్పడంతో ఆమె వాట్సాప్ ప్రొఫైల్, కాంటాక్ట్స్ పూర్తిగా తన యాక్సెస్‌లోకి వచ్చాయని చెప్పాడు. సరదాగా మరికొందరు మహిళలకు కూడా అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపానని నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరచగా పోలీస్ కస్టడీకి తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- bank
- held
- obscene videos
- staffer
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

