Medak | పెళ్లయి ఏడేండ్లు.. సంతానం కలగకపోవడంతో దంపతుల ఆత్మహత్య
Medak | మెదక్ : వారిద్దరిది ప్రేమ వివాహం.. పెళ్లయి ఏడేండ్లు అవుతున్నప్పటికీ సంతానం కలగలేదు. భవిష్యత్‌లో కూడా తమకు పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతో దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
Medak | మెదక్ : వారిద్దరిది ప్రేమ వివాహం.. పెళ్లయి ఏడేండ్లు అవుతున్నప్పటికీ సంతానం కలగలేదు. భవిష్యత్‌లో కూడా తమకు పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతో దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అహ్మద్‌నగర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మద్ నగర్‌కు చెందిన నీరుడి లక్ష్మణ్, రాణి ఏడేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ వీరికి సంతానం కలగలేదు. పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పులు కూడా ఎక్కువ అయ్యాయి. సంతానం కలగకపోవడం, అప్పులు అధికమవడంతో మానసికంగా కుంగిపోయారు. దిక్కుతోచని స్థితిలో ఈ నెల 8వ తేదీన దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు వారిని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాణి నిన్న రాత్రి 8 గంటలకు, లక్ష్మణ్ సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

