లక్నో : ఆ బాలిక పుట్టుకతోనే మూగ, చెవిటి. అలాంటి అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వృద్ధుడు కామంతో చెలరేగిపోయాడు. తొమ్మిదేండ్ల మూగ బాలికపై 60 ఏండ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫర్దాన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వృద్ధుడి ఇంటి పక్కనే మూగ బాలిక నివాసం ఉంటోంది. అయితే స్వీట్లు ఇస్తానని ఆశ చూపి బాలికను తాను ఉండే ఇంటి టెర్రస్‌పైకి తీసుకెళ్లాడు.
బాలిక ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా.. వృద్ధుడి టెర్రస్‌పై కనిపించింది. దీంతో వృద్ధుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జ్యుడిషీయల్ రిమాండ్‌కు తరలించారు. వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు.