గ్యాస్ ట్యాంకర్ – అంబులెన్స్ ఢీ.. నలుగురు దుర్మరణం

భువనేశ్వర్ : ఒడిశాలోని అనుగుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరపడ సమీపంలో 55వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ – అంబులెన్స్ ఢీ కొట్టుకున్న సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. సంబల్పూర్ నుంచి కటక్‌లోని ఓ మెడికల్ హాస్పిటల్‌కు రోగిని అంబులెన్స్‌లో తరలిస్తున్న క్రమంలో జరపడ సమీపంలో గ్యాస్ ట్యాంకర్‌ను ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయిగ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొట్టినట్లుగా సమాచారం. సంఘటనా స్థలంలోనే నలుగురు మరణించగా.. గాయపడ్డ వారిని డీహెచ్‌హెచ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారు జిల్లా ప్రధాన కార్యాలయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

