ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు కరోనా రోగులు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని ఒక కరోనా ఆసుపత్రిలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మరణించారు. రాయ్‌పూర్‌లోని రాజధాని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని ఇతర వార్డులకు వ్యాపించాయని చెప్పారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి కరోనా రోగులను ఖాళీ చేయించినట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలో మరణించిన నలుగురు కూడా కరోనా రోగులని ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. ఒక కరోనా రోగి సజీవ దహనం కాగా మరో నలుగురు పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించకపోవడం, ఆసుపత్రి నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు సీఎం భూపేశ్ భాగేల్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

