రాయ్‌పూర్ : ఓ 20 ఏండ్ల యువకుడు కామంతో చెలరేగిపోయాడు. తనతో అసహజ శృంగారం చేయాలని ఓ మైనర్‌పై ఒత్తిడి చేశాడు. అతని ప్రతిపాదనను తిరస్కరించిన బాలుడిని ఆ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బేమేతార జిల్లాలో చోటు చేసుకుంది.
పంకజ్ విశ్వకర్మ అనే యువకుడు స్థానిక పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అయితే ఓ బాలుడిని మచ్చిక చేసుకుని, తనతో అసహజ శృంగారం చేయాలని ఒత్తిడి చేశాడు. అసభ్యకరమైన వీడియోలు చూపించి వేధింపులకు గురి చేశాడు. విశ్వకర్మ ప్రతిపాదనను మైనర్ తిరస్కరించాడు. దీంతో అతనిపై విశ్వకర్మ కోపం పెంచుకున్నాడు.
సోమవారం రోజు బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పదునైన కత్తితో పొడిచి చంపాడు. అనంతరం విశ్వకర్మ అక్కడ్నుంచి పరారీ అయ్యాడు. అయితే తమ బిడ్డ కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. నిందితుడి విశ్వకర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.