మన ముచ్చట్లు గూగుల్‌కు కోట్లు
మనం అడగ్గానే గూగుల్ క్షణాల్లో సమాచారం ఇస్తుందని సంబరపడిపోతుంటాం. కానీ మనకు అందించినట్టే మన వివరాలను కూడా వేరే వారికి ఇస్తున్నది. మన వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ అంగడి సరుకు చేసింది. ఏదైనా యాప్‌ను తెరిచినప్పుడు కానీ వెబ్‌సైట్‌ను సందర్శించిన ప్రతిసారి మీరు వెతికే సమాచారాన్ని వేలంలో పెడుతున్నది.
- వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటున్న సంస్థ
- తొలి మూడు నెలల్లోనే 4 లక్షల కోట్ల సంపాదన
- డిజిటల్ డాటాను వేలం వేస్తున్న టెక్ దిగ్గజం
- లొకేషన్, బ్రౌజ్ చేసిన సమాచారం దుర్వినియోగం
న్యూఢిల్లీ, మే 19: మనం అడగ్గానే గూగుల్ క్షణాల్లో సమాచారం ఇస్తుందని సంబరపడిపోతుంటాం. కానీ మనకు అందించినట్టే మన వివరాలను కూడా వేరే వారికి ఇస్తున్నది. మన వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ అంగడి సరుకు చేసింది. ఏదైనా యాప్‌ను తెరిచినప్పుడు కానీ వెబ్‌సైట్‌ను సందర్శించిన ప్రతిసారి మీరు వెతికే సమాచారాన్ని వేలంలో పెడుతున్నది. వేలాది అడ్వైర్టెజింగ్ కంపెనీలకు మీ సమాచారాన్ని షేర్ చేస్తున్నది. ఏ సంస్థ ఎక్కువ వేలం పాడితే వారికి మీ వ్యక్తిగత సమాచారాన్ని.. మీరు వెతుకుతున్న వివరాలను అమ్మేస్తున్నది. అప్పుడు ఆ కంపెనీ యాప్ లేదా వెబ్సైట్లో ప్రకటనలు ఇచ్చుకునేందుకు స్పేస్‌ను గూగుల్ ఇస్తుంది. అలా ఒకటి, రెండు కాదు.. లక్షల కోట్ల రూపాయలను గూగుల్ సంపాదించుకుంటున్నది. అలా ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే గూగుల్ ఎంత సంపాదించిందో తెలుసా? ఏకంగా రూ.4 లక్షల కోట్లు కమాయించింది. డిజిటల్ డాటాతో వ్యాపారం చేయడంపై పరిమితులు పెట్టాలంటూ ఏండ్లుగా పోరాడుతున్న ఐరిష్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది.
ఏమేం విషయాలు చెప్తది..
అమెరికా, బ్రిటన్‌లోని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ సేకరించి ఎలా దుర్వినియోగం చేస్తున్నదో ఈ సంస్థ అధ్యయనం చేసింది. అమెరిన్లు, బ్రిటీషర్లకు సంబంధించిన లొకేషన్ డాటా, వారు బ్రౌజ్ చేసిన సమాచారాన్ని ఏడాదిలో ఏకంగా 178 లక్షల కోట్ల సార్లు ప్రకటనల కంపెనీలకు అందజేస్తున్నదట. ఒక్కరోజులో 7 వేల కోట్ల సార్లు వారి సమాచారాన్ని షేర్ చేస్తున్నదట. ప్రతి ఒక్కరు వెతికిన సమాచారం, లొకేషన్ వివరాలు ప్రతి రోజూ సగటున 747 సార్లు వేలంలో పెడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4,700 కంపెనీలకు అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ షేర్ చేస్తున్నదట. ఫేస్బుక్, అమెజాన్ వంటి కంపెనీలు వ్యక్తిగత సమాచారాన్ని అడ్వైర్టెజింగ్ సంస్థలకు ఎంతమేర అందిస్తున్నాయో కలిపితే వాటిని లెక్కించడం మానవమాత్రులకు సాధ్యం కాదేమో.

అంత ప్రమాదమా..?
యాప్‌లు, వెబ్సైట్లు మనకు కావాల్సిన సమాచారాన్ని ఉచితంగానే ఇస్తుంటాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మనకే తెలియకుండా మన ఫోన్లో ఉన్న యాప్‌ల ద్వారా మనం ఎక్కడున్నామో వేరే వారికి తెలిసిపోతుంది. మన ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత, ఆరోగ్య, లైంగికపరంగా గోప్యమైన వివరాలను కంపెనీలకు అమ్ముకుంటున్నాయి. అంటే మనం వాడే ప్రతి స్మార్ట్ పరికరం, యాప్, వెబ్సైట్ ప్రతీది.. మనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయి.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

