కావలసిన పదార్థాలు
స్వీట్ కార్న్: ఒక కప్పు, శనగపిండి: పావు కప్పు, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: కొద్దిగా, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
స్వీట్‌కార్న్ ఉడికించి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో స్వీట్‌కార్న్, శనగపిండి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కొద్దిగా నీళ్లుపోసి ముద్దలా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేయాలి.
సన్నని మంటపై దోరగా వేయించుకుంటే కరకరలాడే స్వీట్‌కార్న్ పకోడి సిద్ధం.