కావలసినపదార్థాలు:
ఖర్బూజ గింజలు: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, నెయ్యి: పావు కప్పు, నీళ్లు: అర కప్పు
తయారీ విధానం:
ముందుగా ఖర్బూజ గింజలను మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి అరకప్పు నీళ్ళలో చక్కెర వేసి, చిన్నమంటపై మరిగించాలి. చక్కెర పాకం చిక్కబడిన తర్వాత ఖర్బూజ గింజల పొడి చల్లుతూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడేకొద్దీ కొద్దికొద్దిగా నెయ్యి వేయాలి. మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత, నెయ్యి రాసిన ప్లేట్లోకి మార్చుకోవాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకుంటే, తియ్యని ‘ఖర్బూజ బర్ఫీ’ రెడీ.