ఎగ్ ఖీమా మసాలా.. కావలసిన పదార్థాలు
స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత తరిగిన టమాట ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. క్యాప్సికమ్, కారం, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి అర కప్పు నీళ్లు పోసి మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు మగ్గించాలి
Healthy food | కావలసిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: నాలుగు, టమాట: రెండు, క్యాప్సికమ్: ఒకటి, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, అల్లం పేస్ట్: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి: పావు టీస్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, వెన్న: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: ఒక టీస్పూన్.
తయారీ విధానం
స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత తరిగిన టమాట ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. క్యాప్సికమ్, కారం, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి అర కప్పు నీళ్లు పోసి మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు మగ్గించాలి. గుడ్లను ష్రెడ్డర్తో తురిమి వెయ్యాలి. చివరగా కొత్తిమీర తురుము, వెన్న, నిమ్మరసం వేసి బాగా కలిపితే నోరూరించే ఎగ్ ఖీమా మసాలా సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

