కావలసిన పదార్థాలునిలువుగా తరిగిన క్యారెట్, అల్లం ముక్కలు: ఒక కప్పు చొప్పున, కారం: అర కప్పు, పప్పుల నూనె: ఒక కప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోంపు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, పసుపు: ఒక టీస్పూన్.
తయారీ విధానం
ముందుగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, సోంపు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో క్యారెట్, అల్లం ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నూనెతోపాటు ముందుగా సిద్ధంచేసి పెట్టుకున్న పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు గంటలపాటు నానబెడితే నోరూరించే క్యారెట్ అల్లం పచ్చడి సిద్ధం. గాలి చొరబడని సీసాలో నెలరోజులు నిల్వ ఉంటుంది.