క్యాబేజీ బోండా
ముందుగా క్యాబేజీని కాస్త పెద్ద ముక్కలుగా అంటే అరంగుళం చొప్పున క్యూబ్ తరహాలో తరుక్కోవాలి. అవి సుమారు రెండు, రెండున్నర కప్పుల ముక్కలు వచ్చేలా చూసుకోవాలి. పచ్చిమిరపకాయలను సన్నగా, పొడుగ్గా తరగాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. ఇది కనీసం పావుకప్పు రావాలి. ఇప్పుడు క్యాబేజీ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేయాలి.
కావలసిన పదార్థాలు
క్యాబేజీ : చిన్నది ఒకటి
పచ్చిమిరపకాయలు: నాలుగు
కొత్తిమీర: పెద్ద కట్ట
కరివేపాకు: నాలుగు రెబ్బలు
బియ్యప్పిండి: కప్పు
శనగపిండి: ముప్పావు కప్పు
జీలకర్ర: టీ స్పూను
ఉప్పు: తగినంత
నూనె: పావు లీటరు
తయారు చేసే విధానం
ముందుగా క్యాబేజీని కాస్త పెద్ద ముక్కలుగా అంటే అరంగుళం చొప్పున క్యూబ్ తరహాలో తరుక్కోవాలి. అవి సుమారు రెండు, రెండున్నర కప్పుల ముక్కలు వచ్చేలా చూసుకోవాలి. పచ్చిమిరపకాయలను సన్నగా, పొడుగ్గా తరగాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. ఇది కనీసం పావుకప్పు రావాలి. ఇప్పుడు క్యాబేజీ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేయాలి. మిశ్రమానికి తగినంత ఉప్పు చల్లాలి. కరివేపాకునీ జోడించాలి. ఇప్పుడు పైన నీళ్లు చల్లి ఈ మిశ్రమాన్ని ముద్దగా కలుపుకోవాలి. పిండి జారుడుగా కాకుండా, కాస్త గట్టిగానే ఉండనివ్వాలి.
ఇప్పుడు వీటిని చిన్న చిన్న గుండ్రటి ఉండలుగా చేసి నూనెలో వేయిస్తే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

