కావలసిన పదార్థాలు
బీట్రూట్ ముక్కలు: ఒక కప్పు, తాజా పెరుగు: అర కప్పు, మైదా పిండి: ఒక కప్పు, చక్కెర: అర కప్పు, వెనిలా ఎసెన్స్: నాలుగు చుక్కలు, నూనె: అర కప్పు, బేకింగ్ పౌడర్: ఒక టీస్పూన్, బేకింగ్ సోడా: పావు టీస్పూన్, ఉప్పు: చిటికెడు.
తయారీ విధానం
మిక్సీజార్లో బీట్రూట్ ముక్కలు, పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఒక గిన్నెలో మైదా, చక్కెర, వెనిలా ఎసెన్స్, నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, బీట్రూట్ మిశ్రమం వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని కేక్ కప్పుల్లో వేసి ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేస్తే నోరూరించే బీట్రూట్ కప్ కేక్స్ సిద్ధం. ఇష్టపడేవాళ్లు పైనుంచి క్రీమ్ జతచేసుకోవచ్చు.